+2 తరువాత మీ కెరీర్ ను మలచుకోవటంలో ఐటీఐ ఎలా సహాయపడుతుంది?

ఇండస్ట్రియల్ ట్రెయినింగ్ ఇన్స్టిట్యూట్స్ లేదా ఐటీఐలు, భారతప్రభుత్వము వారు ఏర్పాటు చేయబడ్డాయి మరియు కార్మిక మంత్రిత్వశాఖ పరిధిలోకి వస్తాయి. ఒక ఐటీఐ నుండి పట్టభద్రులు కావడం తక్కువ ఖరీదైనది. ఇది ఇండియా జనాభాలో అధిక భాగం వారికి ఉత్తమమైనది. విద్యార్హతలకు కనీస ఆవశ్యకత కూడా అధికంగా ఉండదు కాబట్టి, సాంకేతిక పరిజ్ఞానం పొందాలని ఆసక్తి కలిగిన వారు ఈ సంస్థలలో చేరవచ్చు.
ఐటీఐ అందించే కోర్సుల కాలపరిమితి
మీరు ఐటీఐలో చేరినప్పుడు, మీ కోర్స్ యొక్క కాలపరిమితి మీరు ఎంచుకున్న ట్రేడ్ పై ఆధారపడి ఉంటుంది. కోర్సులు సాధారణంగా ఒకటి నుండి మూడు సంవత్సరాల మధ్య ఉంటాయి మరియు ఒక ఎన్ సీ వీ టీ (నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రెయినింగ్) ధృవీకరణపత్రము పొందటానికి, ఔత్సాహికులు తమ పరిశ్రమ లేదా ట్రేడ్ లో ప్రాక్టికల్ శిక్షణను ఒకటి లేదా రెండు సంవత్సరాల వరకు చేయాలి.
ఐటీఐ నుండి కోర్స్ మరియు ఎన్ సీ వీ టీ ధృవీకరణ పత్రము యొక్క ఉపయోగాలు
ఐటీఐ ల నుండి మీరు పొందే ఎన్ సీ వీ టీ ధృవీకరణపత్రానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంటుంది. అందుకని ధృవీకరణ పత్రము పొందిన ఔత్సాహికులు జాతీయ మరియు అంతర్జాతీయ స్థానాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఐటీఐల వద్ద ప్రాక్టికల్ శిక్షణకు ప్రాధాన్యత ఇస్తారు, దీని వలన అనుభవం విషయానికి వస్తే ఐటీఐల నుండి పట్టభద్రులైన వారిదే పై చేయిగా ఉంటుంది.
ఐటీఐలు పరిశ్రమలు మరియు సేవా రంగాల కొరకు సాంకేతిక మానవ వనరులను తయారు చేయుటలో సహాయ పడతాయి. పారిశ్రామిక ట్రేడ్ ఉద్యోగాలు ముఖ్యంగా అనార్గనైస్డ్ రంగాలలో విస్తృతంగా ఉన్నప్పటికీ, అవి ఇప్పటికీ ఇండియాలో ఉద్యోగాల మార్కెట్లో ఎక్కువ భాగంగా నిలుస్తున్నాయి.
ఐటీఐ కోర్స్ తో మీకు అనేక ఎంపికలు ఉంటాయి. అవి మెషీనిస్ట్ లేదా ఎలెక్ట్రీషియన్ వంటి సాంప్రదాయిక సాంకేతిక ఉద్యోగాల నుండి రీటెయిల్ మేనేజ్మెంట్ లేదా హాస్పిటల్ మేనేజ్మెంట్ వంటి సర్వీస్ రంగములో ఉద్యోగాల వరకు ఉంటాయి. మీరు IFFCO వద్ద లేదా ఇతర కంపెనీలలో ఉద్యోగ నియామకములో కూడా పాల్గొనవచ్చు.
ఐటీఐ కోర్స్ పూర్తి అయిన తరువాత
మీ ఎంపికలలో ఒకటి ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేయటం. మీ పరిశ్రమలో ఉద్యోగావకాశాల కోసం IFFCOYuva లో చెక్ చేయండి. లేదా మీరు మరింత ముందుకు వెళ్లవచ్చు! మీరు ప్రాక్టికల్ శిక్షణ కాలం పూర్తి చేసిన తరువాత, మీరు AITT (ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్) పరీక్షకు అర్హత పొందుతారు. ఈ పరీక్షలో మీరు ఉత్తీర్ణులు అయిన తరువాత, మీకు ఎన్ సీ వీ టీ ద్వారా మీ ట్రేడ్ లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ (ఎన్ టీ సీ) అందజేయబడుతుంది. ఐటీఐ తరువాత ఒక సంత్సరం లేదా రెండు సంవత్సరాల వరకు ప్రాక్టికల్ శిక్షణకు వెళ్ళడం మంచి ఆలోచన. ఆ అనుభవాన్ని పొందుటకు మీరు IFFCOYuva లో ఉద్యోగాల కోసం చూడటం ప్రారంభించవచ్చు.
ఐటీఐ తరువాత కెరీర్ అవకాశాలు
ఐటీఐ తరువాత, అభ్యర్ధులకు అకడెమిక్ మరియు ఉద్యోగ సంబంధ అవకాశాలు ఉంటాయి. ఐటీఐ తరువాత, అడ్వాన్స్డ్ ట్రెయినింగ్ ఇన్స్టిట్యూట్ (ఏటీఐ) వద్ద అందించబడే నైపుణ్యము కలిగిన స్వల్ప కాలిక కోర్సులను ఎంచుకోవచ్చు లేదా విదేశాలలో ఉద్యోగం సంపాదించాలనే ఔత్సాహికుల కోసం రూపొందించబడిన కోర్సులను ఎంచుకోవచ్చు. ఇంజనీరింగ్ లో డిప్లొమా వంటి ఉన్నత విద్య కోసం దరఖాస్తు చేసుకోవడం అనేది మరొక ఎంపిక. దీని తరువాత మీరు IFFCOYuva ఉద్యోగాల పోర్టల్ వద్ద ఇంజనీర్ల కొరకు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయడం ప్రారంభించవచ్చు. భారత సేన, నేవీ మరియు ఎయిర్ పోర్ట్ వంటి కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ సంస్థలలో మరియు ప్రైవేట్ రంగాలలో కూడా ఇంజనీరింగ్ మరియు నాన్-ఇంజనీరింగ్ ట్రేడ్స్ లో ఐటీఐ గ్రాడ్యుయేట్స్ కొరకు అనేక ఉద్యోగావకాశాలు ఉన్నాయి; అప్పుడు మీకు వెంచర్లు మరియు వ్యాపారాలను ప్రారంభించే ఎంపిక కూడా ఉంటుంది.
+2 తరువాత ఒక ఐటీఐ అభ్యర్థికి తన నైపుణ్యాలను ఆవిష్కరించుకునేందుకు అవకాశం ఇస్తుంది మరియు తమ కెరీర్ ను ఏర్పరచుకునేందుకు అనేక అవకాశాలను అందిస్తుంది.