Follow Us!

+2 పూర్తి చేసిన తరువాత మీరు దరఖాస్తు చేసుకోదగిన ఉద్యోగాలు

01 May 2019
img

మెరుగైన కెరీర్స్ కోసం ఒక మాధ్యమంగా ప్రాచుర్యం పొందినప్పటికీ, ఉన్నత విద్య ఎప్పుడు ఇండియాలో ఉద్యోగం పొందటానికి ఆవశ్యకత కాదు. వాస్తవానికి ఉన్నత పాఠశాల ధృవీకరణపత్రాలు ఉన్నవారు దేశములోనే సముచితమైన జీతం సంపాదించుకొనుటకు పరిగణించదగిన అనేక కెరీర్ అవకాశాలు ఉన్నాయి.

మీరు సరిగ్గానే చదివారు. కళాశాల డిగ్రీ లేకపోవడం అనేది మీ కెరీర్ కు ముగింపు కాదు. ఒక నిర్దిష్ట పాత్రకు సరిపోయే నైపుణ్యాలు మీకు ఉంటే మంచి చెల్లింపులు అందించే ఉద్యోగం మీరు పొందవచ్చు.

ప్రముఖ ఉద్యోగ వర్గాలు

IFFCOYuva పై 10+2 విద్యార్హత మాత్రమే అవసరం ఉన్న అనేక ఉద్యోగావకాశాలు ఉన్నాయని మీరు తెలుసుకుంటారు. ఈ దిగువన పేర్కొనబడిన వర్గాలకు సంబంధించి పైన పేర్కొన్న అర్హతలతో IFFCOYuva లో ఉద్యోగాల ఓపెనింగ్స్ లో ఉత్తమమైనవి-

కంప్యూటర్ ఆపరేటర్ – వ్యాపారం తమ రోజువారి పనులకోసం ఎక్కువగా ఈ మాధ్యమంపై ఆధారపడటంతో ఈనాటి ఉద్యోగాల మార్కెట్ లో కంప్యూటర్లు విప్లవాన్ని తీసుకొని వచ్చాయి. ఈనాటి మార్కెట్లో కంప్యూటర్ సాఫ్ట్ వేర్ వృత్తినిపుణులకోసం మాత్రమే కాకుండా కంప్యూటర్ హార్డ్ వేర్ లో నైపుణ్యం కలిగిన వారికి కూడా అధిక డిమాండ్ ఉంది.

కస్టమర్ కేర్ ఎక్సిక్యూటివ్ – కస్టమర్ కేర్ ఎక్సిక్యూటివ్స్ ఒక కంపెనీ మరియు దాని కస్టమర్స్ మధ్య ఒక వారధిగా సేవలు అందిస్తారు. కస్టమర్ల నుండి ప్రశ్నలు, ఫిర్యాదులు మరియు అభ్యర్ధనలను పరిశీలించడం వీరి ఉద్యోగములో ఒక ప్రధాన అంశం. తమ లైన్స్ ను కొనసాగించబడిన గంటల వరకు ఉంచే అనేక వ్యాపారాలకు ఇలాంటి నిపుణుల అవసరం ఉంది.

బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ – వివిధ పాశ్చాత్య కార్పొరేషన్లకు బీపీఓ పనుల కోసం ఇండియా ఒక హబ్ కావడంతో, ఈ రంగములో ఉద్యోగావకాశాలు గణనీయంగా పెరిగాయి. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగంగా, ఇందులో ఐటీ హెల్ప్ డెస్క్ సర్వీసెస్ నుండి టెలీమార్కెటింగ్ మరియు కస్టమర్ సపోర్ట్ వరకు అన్ని విధాలైన ఉద్యోగాలు ఉన్నాయి.

డేటా ఎంట్రీ ఆపరేటర్ – డేటా ఎంట్రీ ఆపరేటర్లు కస్టమర్ మరియు అకౌంట్ డేటా ఎంట్రీలను తమ మూల డాక్యుమెంట్ల నుండి ఎలెక్ట్రానిక్ ఫార్మాట్ లోకి మారుస్తారు. ఇందులో ఈ-పుస్తకాలు, వెబ్ సైట్లు, పేపర్స్, యెల్లో పేజెస్, బిజినెస్ కార్డ్స్, కాటలాగ్స్ మొదలైనవి ఉంటాయి. ఇవి సాంకేతికంగా అనిపించినప్పటికీ, ఈ రంగములో ప్రవేశ-స్థాయి ఉద్యోగాలు పరిశ్రమలలో విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి.

ఎలెక్ట్రీషియన్ – ఉన్నత పాఠశాల ఉత్తీర్ణులకు మంచి ఉద్యోగము దొరికే అవకాశం ఉన్న మరొక ట్రేడ్ ఉంది. ప్రైవేట్ సంస్థల నుండి పబ్లిక్ సంస్థలు మరియు విభాగాల వరకు (విద్యుత్, రైల్వేలు, డిఫెన్స్ మొదలైనవి) విద్యుత్ సాధనాలు మరియు వ్యవస్థలను ఇన్స్టాల్ చేయుటకు మరియు నిర్వహించుటకు ఎలెక్ట్రీషియన్ల ఆవశ్యకత ఉంది.

మెకానిక్ – మెకానిక్స్ కు పబ్లిక్ మరియు ప్రైవేట్ రంగాలలో దేశవ్యాప్తంగా అత్యధిక డిమాండ్ ఉంది. వీరు మొటారు భాగాల మరమ్మత్తు మరియు క్రమానుసార నిర్వహణ చేసే వృత్తి నిపుణులు. మెకానిక్స్ ఒక ప్రత్యేక రకమైన వాహనము లేదా ఎలెక్ట్రానిక్ భాగములో నైపుణ్యత కలిగి ఉండవచ్చు.

పైన-పేర్కొనబడిన ఎంపికలు ప్రముఖమైనవి అయితే, కళాశాల/విశ్వవిద్యాలయ విద్య లేని వారు ఎంచుకునేందుకు అనేక ఇతర ఎంపికలు ఉన్నాయి. IFFCOYuva వద్ద ఉద్యోగాలు అనేది పైన-పేర్కొనబడిన ఉద్యోగ వర్గాలు మరియు మరెన్నిటినో కవర్ చేస్తుంది.

గెయిన్ సర్టిఫికేషన్లు లేదా స్పెషలైజేషన్లు

ఐటీఐ లేదా ఇండస్ట్రియల్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ అనేవి పారిశ్రామిక శిక్షణ కోసం వివిధ వొకేషన్లలో అభ్యర్థులకు ఉద్యోగ-నిర్దిష్టమైన శిక్షణలను అందించుటకు దేశంలో యూనియన్ ప్రభుత్వము ఏర్పాటు చేసిన కేంద్రాలు. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో ఏర్పాటు చేసిన ఐటీఐలు ఉన్నాయి. 14 నుండి 40 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ఎవరైనా ఐటీఐ లో ప్రవేశము పొందవచ్చు. విద్యార్హతలు 8వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఉండవచ్చు. ఒక ఐటీఐ ధృవీకరణ అనేది (6 నెలల నుండి 2 సంవత్సరాల వరకు ఉంటుంది) పాఠశాల తరువాత మీ కెరీర్ అవకాశాలకు మంచి వృద్ధిని ఇస్తుంది.

ఎంపికకు ఉద్యోగార్హత ప్రధాన కారకం కాదు కాబట్టి, ఎంప్లాయర్లు అభ్యర్ధుల నైపుణ్యాలు లేదా ప్రతిభపై ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తారు అని ఉద్యోగ దరఖాస్తుదారులు అందరు దృష్టిలో ఉంచుకోవాలి. ఇప్పుడు, కొత్త ఉద్యోగులకు నిర్దిష్ట శిక్షణను అందించే కొన్ని కంపెనీలు ఉన్నాయి, అయితే అభ్యర్ధులు ఆయా రంగాలలో వొకేషనల్ ధృవీకరణపత్రాలు లేదా ముందస్తు అనుభవము కలిగి ఉండటం అవసరం అనే మరి కొన్ని కంపెనీలు ఉన్నాయి.

ముఖ్యమైన సమాచారము

+2 తరువాత మీ కెరీర్ ను మలచుకోవటంలో ఐటీఐ ఎలా సహాయపడుతుంది?

ఇండస్ట్రియల్ ట్రెయినింగ్ ఇన్స్టిట్యూట్స్ లేదా ఐటీఐలు, భారతప్రభుత్వము వారు ఏర్పాటు చేయబడ్డాయి మరియు కార్మిక మంత్రిత్వశాఖ పరిధిలోకి వస్తాయి. ఒక ఐటీఐ నుండి పట్టభద్రులు కావడం తక్కువ ఖరీదైనది. ఇది ఇండియా జనాభాలో అధిక భాగం వారికి ఉత్తమమైనది. విద్యార్హతలకు కనీస ఆవశ్యకత కూడా అధికంగా ఉండదు కాబట్టి, సాంకేతిక పరిజ్ఞానం పొందాలని ఆసక్తి కలిగిన వారు ఈ సంస్థలలో చేరవచ్చు.v

+2 పూర్తి చేసిన తరువాత మీరు దరఖాస్తు చేసుకోదగిన ఉద్యోగాలు

మెరుగైన కెరీర్స్ కోసం ఒక మాధ్యమంగా ప్రాచుర్యం పొందినప్పటికీ, ఉన్నత విద్య ఎప్పుడు ఇండియాలో ఉద్యోగం పొందటానికి ఆవశ్యకత కాదు. వాస్తవానికి ఉన్నత పాఠశాల ధృవీకరణపత్రాలు ఉన్నవారు దేశములోనే సముచితమైన జీతం సంపాదించుకొనుటకు పరిగణించదగిన అనేక కెరీర్ అవకాశాలు ఉన్నాయి.

మీరు సరిగ్గానే చదివారు. కళాశాల డిగ్రీ లేకపోవడం అనేది మీ కెరీర్ కు ముగింపు కాదు. ఒక నిర్దిష్ట పాత్రకు సరిపోయే నైపుణ్యాలు మీకు ఉంటే మంచి చెల్లింపులు అందించే ఉద్యోగం మీరు పొందవచ్చు.

గ్రాడ్యుయేషన్ తరువాత స్టార్ట్ అప్ కంపెనీలతో పనిచేయుట వలన 4 ఉపయోగాలు

స్టార్ట్ అప్స్ అనేక విధాలైన ప్రోత్సాహకాలను అందిస్తాయి అనేది ఒక సాధారణమైన అవగాహన అయినా, ఒక స్టార్ట్ అప్ లో పనిచేయడం అనేది అంతకు మించినది అని మీరు తెలుసుకోవాలి. ఈరోజులలో, చాలామంది పట్టభద్రులు ప్రోత్సాహకాల కోసం కాకుండా నేర్చుకునేందుకు తమకు ఉన్న అవకాశాల కోసం స్టార్ట్ అప్స్ లో ఉద్యోగాల ను ఎంచుకుంటున్నారు.

మీరు మీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఒక స్టార్ట్ అప్ కు వెళ్ళాలా వద్దా అని ఇంకా ఆందోళన పడుతూ ఉంటే, మీరు ఈ క్రింది విషయాలను తెలుసుకోవాలి:

పైప్ ఫిట్టర్ వర్సస్ వెల్డర్ - మీరు తెలుసుకోవలసినది

మీరు నైపుణ్యం కలిగిన ఒక ట్రేడ్ ను నేర్చుకోవాలని నిర్ణయించుకుంటే, మీరు ఎంచుకునేందుకు అనేక ట్రేడ్ లు ఉన్నాయి. పైప్ ఫిట్టర్లు మరియు వెల్డర్లు అనేవి ఇలాంటి అధిక చెల్లింపులు కలిగిన నైపుణ్యం కలిగిన ట్రేడ్ లు. వాణిజ్య పరిశ్రమల నుండి నివాసిత ప్రదేశాల వరకు తయారీ ప్లాంట్స్ మరియు ఆయిల్ రిఫైనరీల వరకు వివిధ పరిశ్రమలలో ఈ నైపుణ్యాల ఆవశ్యకత ఉంది. కాని ఖచ్ఛితంగా చెప్పాలంటే అది ఏమిటి? మనం తెలుసుకుందాం.

తమ హెచ్ ఆర్ అభ్యర్ధులలో కంపెనీలు ఆశించే నైపుణ్యాలు

మీరు హెచ్ ఆర్ అంటే హూమన్ రిసోర్సెస్ లో ఒక స్థానం కోసం దరఖాస్తు చేసినప్పుడు, మీరు దానికి అవతలి వైపు ఉంటారు. అంటే ఇంటర్వ్యూలు ఇవ్వడం నుండి ఇంటర్వ్యూలు తీసుకోవడం అన్నమాట.

హెచ్ ఆర్ ఎక్సిక్యూటివ్ యొక్క పాత్రలో ఉద్యోగుల సంక్షేమము మరియు సంబంధిత కంపెనీ యొక్క సున్నితమైన సమాచారాన్ని నిర్వహించడం వంటివి ఉంటాయి. ఈ ఉద్యోగము సున్నితమైన మనసు కలిగిన వారికి వర్తించదు. మీరు హెచ్ ఆర్ ఎక్సిక్యూటివ్ లేదా ముంబై, నోయిడా లేదా మీ ప్రాధాన్యత నగరములో ఫ్రెషర్ ఉద్యోగాల కోసం చూస్తూ ఉంటే, కంపెనీలు హెచ్ ఆర్ అభ్యర్థులలో ఆశించే నైపుణ్యాల గురించి మీరు తెలుసుకోవాలి:

 

మీరు తెసుకుకోవలసిన 5 ఐటీఐ ట్రేడ్ లు

ఐటీఐ (ఇండస్ట్రియల్ ట్రెయినింగ్ ఇన్స్టిట్యూట్) వారి ట్రేడ్ లు పాఠశాల నుండి ఉత్తీర్ణులైన వారి కోసం రూపొందించబడ్డాయి, అలాగే 10వ తరగతి మరియు 12వ తరగతి ఉత్తీర్ణులైన వారి కోసం 100 కంటే ఎక్కువ కోర్సులు కూడా ఉన్నాయి. ఐటీఐ కోర్సులు రెండు రకాలుగా విభజించబడ్డాయి, అవి:

1. ఒక సంవత్సరం ఐటీఐ కోర్సులు

2. రెండు సంవత్సరాల ఐటీఐ కోర్సులు

ఒక ఇంటర్వ్యూ కొరకు ఏమి ధరించాలి?

ఒక ఇంటర్వ్యూ కోసం ఎలాంటి దుస్తులు ధరించాలి అనేది ఉద్యోగాన్వేషణ ప్రక్రియలో అత్యంత సందేహాత్మక భాగము. అక్కడ అడిగే ప్రశ్నలకు మీకు ఎంత బాగా సమాధానాలు తెలిసి ఉన్నప్పటికీ, ఒక ఉద్యోగ ఇంటర్వ్యూ విజయవంతం కావడం అనేది మిమ్మల్ని మీరు ఎంత బాగా వ్యక్తపరచుకుంటారు అనేదాని పై కూడా ఆధారపడి ఉంటుంది. అందుకే మీరు తమ కంపెనీకి సరైన వారని ఉద్యోగాల మేనేజర్ ను ఒప్పించడములో అందంగా అలాగే ఒద్దికగా ఉండే మీ ఆకృతి చాలా ముఖ్యమైనది.

ఒక ఇంటర్వ్యూ కోసం ఏమి ధరించాలి అని మీరు ఆలోచించే సమయములో మీరు అనుసరించదగిన కొన్ని చిట్కాల జాబితా ఇక్కడ ఇవ్వబడింది:

మీ కెరీర్ ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళగలిగే ముఖ్యమైన సమాచారం

మార్కెట్కు భిన్నంగా ఉండటమే కాకుండా నిరంతరంగా మారుతున్న కాలములో మనము ఉన్నాము.కాబట్టి, ఈ క్రియాశీలక పని వాతావరణములో కేవలము కొనసాగడమే కాకుండా వృద్ధి చెందాలని ఆశించే వారు స్వీకృతి మరియు ప్రయోజనకర ధోరణి అనే కీలకమైన లక్షణాలు కలిగి ఉండాలి. మీరు ఒక వృత్తిపరుడిగా మీ ప్రయాణాన్ని ప్రారంభించాలని ఎదురుచూస్తున్న పట్టభద్రులైన లేదా మెరుగైన అవకాశాల కొరకు చూస్తున్న యువ వృత్తిపరులైనా,మీరు మిమల్ని విలువైన ఆస్తిగా చేసే లక్షణాలు మీ పోర్ట్ ఫోలియోలో కలిగి ఉండాలి. మీ లక్షణాలు ఎంత విభిన్నంగా మరియు ప్రేత్యేకంగా ఉంటాయో, మీరు అంతగా ఇతరుల నుండి మెరుగ్గా ఉంటారు.

ఫ్రెషర్ గా ఒక మంచి ఉద్యోగాన్ని పొందడము ఎలా?

ఢిల్లీ, ముంబై మరియు అలాంటి నగరాలలో ఫ్రెషర్ కోసం ఉద్యోగము, కనుగొనడము అందరు అనుకున్నంత కష్టతరమైనది కాదు. అయినప్పటికీ, అప్పుడే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని వారికి మరియు ముంబై మరియు ఇతర మెట్రోపాలిటన్ నగరాలలో ఫ్రెషర్ కు ఉద్యోగాలు ఉంటాయా, మరియు వారు తమకు ఒక ఉద్యోగము ఎలా సంపాదించుకోగలరు అనేది ఒక ప్రధానమైన సమస్య. ముందుగా ఫ్రెషర్ కాల్స్ చేయుటకు మరియు తమకు సరైన ఉద్యోగము దొరికే వరకు వివిధ లిస్టింగ్స్ లో ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేస్తూ ఉండేందుకు తమనుతాము సిద్దము చేసుకోవాలి. ఇంకా, ఈ క్రింది చిట్కాలను గుర్తు ఉంచుకుంటే, అది వారికి సహాయపడుతుంది:

మెరుగైన కెరీర్ వికాసానికి చిట్కాలు

భారత ఉద్యోగ మార్కెట్ లో డిమాండ్ ఉన్న కోర్సులు ఏమిటి

పాతకాలములో మాదిరిగా కాకుండా, ఈనాటి విద్యార్థులు వివేకవంతులు మరియు తెలివిగలవారు, ముఖ్యంగా వారు అనుసరిాంచాలని అనుకునే కెరీర్ ను ఎంపిక చేసుకొనుటలో. కావలసిన దాని కంటే ఎక్కువ కెరీర్ ఎంపికలు అందుబాటులో ఉన్న ప్రస్తుత పరిస్థితిలో, విద్యార్థులలో పైన పేర్కొనబడిన వంటి లక్షణాలు కలిగి ఉండటము వలన వారు తికమక పడకుండా ఉండగలరు.

తనకు ఒక సరైన కెరీర్ ను కనుగొనుట కొరకు ఉత్తమమైన మార్గములో ఉన్న ప్రముఖమైన కారకాలను అంచనా వేయడము, ఉదాహరణకు తమకు ఆశక్తి ఉన్న రంగము మరియు మార్కెట్ లో డిమాాండ్ ఉన్న కోర్సులు.

ఉద్యోగయజమానులు ఉద్యోగులలో ఏ రకమైన నైపుణ్యాల కొరకు

ప్రతి రంగములో సాంకేతికత యొక్క అనుసంధానముతో, ఆన్ లైన్ ఉద్యోగ దరఖాస్తులు కనుగొనడము కష్టమైన పని కాదు. మీరు సరైన పరిమితులతో వెతకాలి మరియు ప్రతి రంగములో అందుబాటులో ఉన్న ఉద్యోగాల పెద్ద జాబితాను చూడవచ్చు. అయినప్పటికీ,భారతదేశములో అనేక ఉద్యోగ పోర్టల్స్ ఉన్నా కూడా, ఆన్లైన్ లో ఉద్యోగ దరఖాస్తులు చూపించడము అనేది మీపై మరియు మీ నైపుణ్యాలు మరియు మీరు ముఖాముఖి పరీక్షను ఎలా చేస్తారు అనేదానిపై ఆధారపడి ఉంటుంది; మరియు అది మీకు ఆ ఉద్యోగము వస్తుందా లేదా అనేది నిర్ణయిస్తుంది. ఇది ఒక గ్రాడ్యుయేట్ లేదా ఫ్రెషర్ కు ఎక్కువగా వర్తిస్తుంది, ఎందుకంటే ఢిల్లీ, ముంబై లేదా ఇతర నగరాలలో ఎంతో పోటీ ఉంటుంది మరియు ఒక ఫ్రెషర్ గా మీకు ముఖాముఖి పరీక్షలు లేదా దరఖాస్తు నిర్వహణలో అనుభవము లేకపోవచ్చు.

మేనేజ్మెంట్ ఉద్యోగాలు – భారతదేశములోఒక ప్రముఖ కెరీర్

మేనేజ్మెంట్ ఉద్యోగాలు దేశములో ఎప్పటినుండో ఉన్నపటికీ,ఇటీవల వీటి చుట్టూ ఉన్న హైప్ అసాధారణంగా ఉంది.ఈనాడు అన్ని రంగాల నుండి విద్యార్థులు తమ జీవితములో ఎప్పుడో ఒకప్పుడు మేనేజ్మెంట్ కోర్స్ నేర్చుకోవాలని అనుకుంటారు.బాగా ఆలోచిస్తే, దీనికి  కారణము సుస్పష్టము.

మేనేజ్మెంట్ ఉద్యోగాలు మీరు పనిచేస్తున్న పరిశ్రమతో సంబంధము లేకుండా ప్రతి చోటా ఉన్నాయి. వివిధ ఇండియన్ ఇంస్టిట్యూట్స్ ఆఫ్

మేనేజ్మెంట్ అనేది ప్రతి రంగములో ఎలా ఉంటుంది అనేది తెలిసిన  నేపద్యములో, “మేనేజ్మెంట్” ఒక గొడుగు వంటిది  అని  చెప్పడము అతిశయోక్తి కాదు. మీరు ఒక డిగ్రీ చదవచ్చు మరియు ఆ తరువాత ఆర్ధిక రంగము,ఆపరేషన్లు,మార్కెటింగ్,మానవ వనరులు,సమాచార సాెంకేతికత మరియు విపత్తు నిర్వహణ  మొదలైన రంగాలలో ఒక ఉద్యోగానికి వెళ్ళవచ్చు. అమ్మకాలు మరియు మార్కెటింగ్ లేదా ఇంజనీరింగ్ మరియు అర్చిటెక్చర్లో ముఖ్యమైన ఉద్యోగాలే కాకుండా,హోటల్ మేనేజ్మెంట్ ఉద్యోగాలు మరియు ఈవెెంట్ మేనెజ్మెంట్ ఉద్యోగాలు కూడా ఈ రంగములో అభివృద్ధి చెందుతున్నాయి.

బీమా కస్టమర్ సర్వీస్ ప్రతినిథి యొక్క పాత్ర

ఒక బీమా కస్టమర్ సర్వీస్ ప్రతినిథి తమ ఉత్పత్తి మరియు సేవలకు సంబంధంచిన ప్రశ్నలకు స్పందించే వీలుగా వినియోగదారులకు సమాచారాన్ని అందిస్తారు. అతను/ఆమె ఫిర్యాదులను నిర్వహించాలి మరియు వాటిని పరిష్కరించాలి. అదనంగా, ఒక బీమా సర్వీస్ ప్రతినిధికి కావలసిన సహాయము మరియు క్లయింట్ సహకారము అందిస్తారు కాబట్టి అతనికి కస్టమర్ కేర్ ప్రతినిథికి ఉన్న బాధ్యతల వంటివే ఉంటాయి. కొన్నిసార్లు , అతను/ఆమె ఒక పరిష్కారాన్ని అందించేందుకు నియమిత విభాగానికి ఆ ఫిర్యాదులను పంపించవలసి ఉంటుంది.

మీరు బీమా రంగములో ఒక కస్టమర్ సర్వీస్ ప్రతినిధి  ఉదోగానికై చూస్తూ ఉంటే, మీరు వాటి కొరకు ఆరోగ్య బీమా, జీవిత బీమా మరియు సాధారణ బీమా ఉద్యోగాలలో వెతకవచ్చు. బీమా కొనుగోలుదారులకు సేవలను అందించుటలో  ఒక కస్టమర్ సర్వీస్ ప్రతినిథి యొక్క పాత్ర గురించి తెలుసుకొనుటకు నైపుణ్యాలు, విధులు మరియు ఇతర ఉపయోగకర సమాచారము గురించి చదవండి.

మహిళలకు డిప్లొమా ఇంజనీరింగ్ ఉద్యోగాలలో సవాళ్ళు

భారతదేశములో, ఇప్పటివరకు, నైపుణ్యము కలిగిన పని సంప్రదాయకంగా శిక్షణ పొంది చేయబడింది. తరచూ ఈ నైపుణ్యాలను ఉద్యోగములో ఉన్న తమ తండ్రులు నుండి కొడుకులు నేర్చుకునేవారు.

కాని గత కొన్ని దశాబ్దాలుగా నైపుణ్యవికాసానికి సరైన శిక్షణ యొక్క ఆవశ్యకత గుర్తించబడింది. నైపుణ్య వికాస లోపము కారణంగా పరిశ్రమలపై ప్రతికూల ప్రభావము తరువాత,ఇటీవల ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (పీఎంకేవీవై) ప్రారంభించబడింది.నాలుగు సంవత్సరాలలో (2016-2020) 10 లక్షల మంది యువతకు ప్రయోజనము అందించడమే ఈ పధకము యొక్క ఉద్దేశము.

భారతదేశపు 10 అత్యధిక నైపుణ్య ఆధారిత ఉద్యోగాలు

గత 10 సంవత్సరాలుగా భారత ఆర్థికవ్యవస్థలో అపూర్వమైన వృద్ధి ఉంద్ధ. ఈ వృద్ధి కొనసాగుతుంది మరియు రాబోయే 2-3 దశాబ్దాలలో భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచములోనే మూడవ అతిపెద్ద  ఆర్థిక వ్యవస్థగా అవుతుంది.

నైపుణ్య ఆధారిత ఉద్యోగాలు ఈ అభివృద్ధిలో ఒక పెద్ద  సహాయకారి, ఎందుకంటే నైపుణ్య ఆధారిత పనులు లేకుండా ఏ చిన్న లేదా పెద్ద యంత్రాలు లేదా చిన్న కర్మాగారాలు పనిచేయవు.

ఒక ముఖాముఖి పరీక్షకు ఎలా సిద్ధమవ్వాలి

ఉద్యోగానికి తగిన నైపుణ్యాలు, పరిజ్ఞానము మరియు అనుభవము మీకు ఉన్నాయని అర్థం చేసుకోవడమే ముఖాముఖి పరీక్ష యొక్క లక్ష్యము. ముఖాముఖి పరీక్ష సమయములో మీరు ఉద్యోగ వివరణను అర్థం చేసుకున్నారని, సంస్ధ పని గురించిన అవగాహన కలిగి ఉన్నారని, మరియు ఆ సంస్ధలోని పదవి యొక్క బాధ్యతను తీసుకునేందుకు పూర్తిగా సిద్ధంగా ఉన్నారని ఇంటర్వ్యూయర్ విశ్వసించేలా చేయాలి.

ముఖాముఖి పరీక్షకు ముందే ఆ సంస్ధ గురించిన సమాచారాన్ని తెలుసుకోండి

శ్రామిక వర్గములో చేరడము . ఒక బయోడేటా తయారు చేయడము ఎలా

ఒక బయోడేటా తయారు చేయడము ఎలాగో ఇక్కడ  తెలుపబడింది

బయోడేటా అంటే  ఏమిటి? బయోడేటా అనేది మనము ఉద్యోగము కొరకు  దరఖాస్తు  చేసే సమయములో ఉద్యోగయజమాన్యాలు /సంస్థకు  సబ్మిట్ చేసే ఒక దస్తావేజు . ఈ బయోడేటా సహాయముతో మనము మన పని అనుభవము, విద్యార్హత  మరియు నైపుణ్యాలు  గురించి చెప్పగలము

ముఖాముఖి పరీక్షల్లో సాధారణంగా అడిగే 10 ముఖ్యమైన ప్రశ్నలు

ఒక ముఖాముఖి పరీక్షకు వెళ్ళే సమయములో అతిపెద్ద ఉత్సుకత – నన్ను దేని గురుంచి  అడుగుతారు? ఈ విషయానికి అసలైన స్పందనలు  ముఖాముఖి పరీక్ష సమయములో మాత్రమే  తెలిసినప్పటికీ , ముఖాముఖి పరీక్షలో అడిగే కొన్ని  సాధారణ ప్రశ్నలు  ఉన్నాయి . మీరు వాటి సమాధానాలను  అభ్యాసము  చేస్తే, మీరు విశ్వాసముతో సమాదానాలు చెప్పగలుగుతారు  మరియు  ఇతర ప్రశ్నలకు  సమాదానాలు చెప్పే సమయములో  కూడా మీరు మీ ఆత్మవిశ్వాసాన్ని  పెంచుకోగలుగుతారు. ముఖాముఖి పరీక్షలలో అడగబడే 10 ముఖ్యమైన ప్రశ్నలు మరియు వాటి సమాదానాలు ఇలా ఉండవచ్చు .

కెరీర్ ఏర్పరచుకునేందుకు పాఠశాల తరువాత మీరు పరిగణించదగిన లాభదాయకమైన రంగాలు

ఒకవేళ IFFCOYuva ఉద్యోగ పోర్టల్ వద్ద వెబ్ మెట్రిక్స్ ను అనుసరించాలి అని అనుకుంటే, ప్రజలు అత్యంత లాభదాయకమైన కెరీర్ రంగాలుగా పరిగణించే కొన్ని ఖచ్ఛితమైన ట్రెండ్స్ ఉన్నాయి. తమ పాఠశాల చదువు పూర్తి చేసిన విద్యార్థులకు, లాభదాయకమైన రంగాల గురించి తెలుసుకోవడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఆ విధంగా, వాళ్ళు ఒక కెరీర్ ఏర్పరచుకునేందుకు తాము తీసుకోవలసిన తరువాతి చర్య గురించి అవగాహన పూర్తిగా నిర్ణయం తీసుకోగలుగుతారు.

ఉద్యోగాలు వెతుకు